వర్షాధారంపై నల్లరేగడి నేలల్లో పంటల సాగు చేస్తున్నట్లయితే, చివరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు కలపాలి. విత్తనాలు విత్తిన వెంటనే బరువైన నేలల్లో ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తేలిక నేలల్లో అయితే ఒక లీటరు పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.