పూర్వ కాలం నుంచి గ్రామ చావడి లేదా మసీదుల్లో పీర్లను ప్రతిష్టిస్తారు. పీర్లు ప్రతిష్టించిన ప్రదేశం ముందు అలాం (గుండం) నిర్మిస్తారు. నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం పీర్లకు మలీద ముద్దలు, బెల్లం శాక, ఊదు బెల్లం ప్రసాదంగా పెడతారు. అనంతరం పీర్లను ఊరేగిస్తారు. పీర్లను ఊరేగించే సమయంలో కొందరికి పూనకం వస్తుంది. వారు పీర్లను పట్టుకుని ఉత్సాహంగా తిరుగుతారు.