నైజీరియాలోని బెన్యూ రాష్ట్రంలో గన్మెన్లు జరిపిన కాల్పుల్లో 100 మంది మృతిచెందారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. పలువురు గాయపడగా, చాలామంది ఆచూకీ తెలియకపోయిందని తెలిపింది. కొందరు ఇళ్లలోనే కాలిపోయారు. అక్కడ భూముల వివాదాలపై ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య 2019 నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ దాడులతో వందలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.