చైనాను భీకర గాలులు వణికిస్తున్నాయి. దీంతో వందలాది విమాన సర్వీసులను రద్దు చేశారు. బీజింగ్, డాక్సింగ్‌లో మధ్యాహ్నం 2 గంటల కల్లా 693 విమాన సర్వీసులు రద్దయినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది. దుమ్ము తుపానులు చెలరేగే అవకాశం ఉండటంతో పార్కులు సైతం మూసేసినట్లు అధికారులు వెల్లడించారు. భారీగా గాలులు వీయడంతో రాజధాని బీజింగ్‌లో భారీగా చెట్లు నేలకొరగడంతో పాటు, పాత ఇళ్లు ధ్వంసం అయ్యాయి.