UPలోని బహరాయిచ్ జిల్లాలో పెళ్లి వేడుకలో గొడవ చోటు చేసుకుంది. కోత్వాలీ దేహాత్ ప్రాంతం టికోడా మోడ్ వద్ద జరిగిన ఈ పెళ్లిలో నగల విషయంలో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి గొడవ ఎక్కువ అయ్యింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు విచారణ ప్రారంభించారు.