గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఒక నామినేషన్ దాఖలు

79చూసినవారు
గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఒక నామినేషన్ దాఖలు
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ MLC ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. మంచిర్యాల(D) జన్నారం(M) దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ MLC స్థానానికి నామినేషన్ వేశారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ స్వీకరించారు. మొత్తంగా 05.02.2025 వరకు ఉపాధ్యాయ MLC స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేట్ MLC స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్