తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు (VIDEO)

74చూసినవారు
తిరుమలలో శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభవిరామ దర్శన సమయంలో నటులు సుమన్, రాజేంద్రప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్