ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణకు మాతృవియోగం జరిగింది. ఆయన కన్న తల్లి సుశీల(75) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారి స్వగ్రామం తెనాలిలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. సుశీల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.