స్పెయిన్‌లోని పాల్మా డె మేయర్క్ ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాన్ఎయిర్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా అందులో ఫైర్ అలర్ట్ వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు పంపే చర్యలు చేపట్టారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు మాత్రం భయంతో విమానం రెక్కలపై నుంచి కిందికి దూకారు. దీంతో దాదాపు 18మందికి స్పల్వ గాయాలయ్యాయి.