AP: విశాఖ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురుదేవ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన అధికారులు మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.