ఒడిశాలో గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు.. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా మీదుగా వెళ్తుండగా మచ్‌కుండ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలులోని పలు వ్యాగన్‌లలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, రైలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.