పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగి 150 వాహనాలు దగ్ధం (వీడియో)

68చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీరామ్‌పురలో జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు పార్కు చేసిన 150 వాహనాలు దగ్ధమయ్యాయి. పలు కేసుల్లో వాహనదారుల నుంచి సీజ్‌ చేసిన వాహనాలను పోలీసులు ఖాళీ ప్రదేశంలో పార్క్‌ చేశారు. అయితే, ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. వేడి, బ్యాటరీల్లో మండే పదార్థాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్