విద్యుత్ స్తంభంపై చెలరేగిన మంటలు, తప్పిన ప్ర‌మాదం

75చూసినవారు
విద్యుత్ స్తంభంపై చెలరేగిన మంటలు, తప్పిన ప్ర‌మాదం
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆలేరు పట్టణంలోని మంతపురి రోడ్డులో ఓ విద్యుత్ స్తంభంపై షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా, లైన్‌మెన్ రమేశ్ నీళ్లు, కర్రలతో మంటలు ఆర్పేశాడు. విద్యుత్ సరఫరా ఉండగానే ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభంపై విచక్షణారహితంగా ఉండడమే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్