బేగంబజార్‌లో అగ్నిప్రమాదం.. మహళను రక్షించిన ఫైర్ సిబ్బంది (వీడియో)

65చూసినవారు
హైదరాబాద్‌ బేగంబజార్‌లో మహారాజ్‌గంజ్‌లో మూడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఒక మహిళను భవనం నుంచి సురక్షితంగా రక్షించారు. మిగిలిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్