మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లా ఉమ్రేర్‌లోని అల్యూమినియం ఫాయిల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు కాగా నాగ్‌పుర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.