అమెరికాలో మరో విమాన ప్రమాదం.. వణికిపోయిన ప్రయాణీకులు

73చూసినవారు
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న జార్జ్ బుష్ ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అవుతున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక రెక్క నుంచి మంటలు వచ్చాయి. దీంతో విమానంలోని ప్రయాణికులను కిందకు దించేశారు. మంటలను ఆర్పివేశామని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అక్కడి అగ్నిమాపక విభాగం తెలిపింది.

సంబంధిత పోస్ట్