తెలంగాణలోని బీబీనగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న ఓ రైలులో మంటలు కనిపించాయి. గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేశారు. దీంతో బీబీ నగర్ వద్ద రైలును ఆపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.