చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయి: డీజీ నాగిరెడ్డి

83చూసినవారు
చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయి: డీజీ నాగిరెడ్డి
TG: షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు. భవనంలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన మెయిన్‌ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని కార్మికులు చెబుతున్నారని అన్నారు. అగ్నిప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్