AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. తొలుత ఆయన ఘటనా స్థలిని పరిశీలించారు. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం కేజీహెచ్‌కు తరలిస్తామన్నారు. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు.