TG: అధికారులు ఉద్యోగంలా కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో బోనాలు ఘనంగా జరిగేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. HYDలో ఆషాఢమాసంలో జరుగనున్న బోనాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. 'జూన్ 26న తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుంది. బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. రంగం, తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా రూ. 20 కోట్లు కేటాయించాం' అని వివరించారు.