AP: తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండ పైనుంచి దిగువకు పంపేందుకు ఈవో శీనానాయక్‌తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.