అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన అత్యవసర భేటీ జరిగింది. ఈ సమావేశంలో విమానయాన భద్రత, ఇతర కీలక అంశాలపై చర్చించారు. డీజీసీఏ డైరెక్టర్ జనరల్, ఏఏఐ ఉన్నతాధికారులు, పౌర విమానయాన కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశంలో విమాన భద్రతపై కీలక ప్రకటన చేయనున్నారు.