ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెయింట్ లూసియా దేశానికి పతకం దక్కింది. తొలి పతకంగా ఏకంగా గోల్డ్ మెడల్ నే ఖాతాలో వేసుకుంది. సెయింట్ లూసియా రన్నర్ జూలియన్ అల్ఫ్రెడ్ తన దేశానికి తొలి పతకం అందించిన ఘనత దక్కించుకుంది. ఆమె వంద మీటర్ల పరుగు పందెంలో కేవలం 10.72 సెకన్‌లలో రేసును పూర్తి చేసి పసిడి పతకాన్ని ఒడిసిపట్టింది.