భారత్ - ఇంగ్లాండ్ మధ్య గురువారం తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని సాధించిన బ్యాటర్‌గా సచిన్ రికార్డ్‌కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ ఈ మైలురాయిని చేరడానికి 350 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్‌లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు.