కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. మరో మృతదేహం లభ్యం

84చూసినవారు
TG: భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన తాపీ మేస్త్రీ పడిశాల ఉపేందర్‌ మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సహాయక బృందాలు బయటకు తీశాయి. ఈ ఘటనలో చల్లా కామేశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, సింగరేణి బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్