'ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం'

36067చూసినవారు
'ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం'
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఏటపాక, గుండాల, పురుషోత్త పట్నం, కన్నెగూడెం, పిచకలపాడు గ్రామాలు తెలంగాణలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్