AP: టాబ్లెట్ వికటించి ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం తాడేపల్లిలో చోటు చేసుకుంది. అల్బెండజోల్ మాత్రలు వేసిన కొద్ది సేపటికే చిన్నారి రష్మిత నోటి నుంచి నురుగ వచ్చింది. స్పృహ కోల్పోయిన చిన్నారిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. దాంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.