సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రుణమాఫీ అయింది.. మాజీమంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీలు తీయడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.