అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దంపతులు సానుభూతి తెలిపారు. 'విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం చూసి మాతోపాటు రిలయన్స్ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైంది. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ మద్దతు ఇస్తుంది. సాధ్యమైనంత వరకూ అన్నివిధాలా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితులకు జరిగిన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం' అని తెలిపారు.