అహ్మదాబాద్‌లో BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై లండన్‌కు వెళ్లే విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపుతోంది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం తాకడంతో భవనపు స్లాబ్ పూర్తిగా కూలిపోయింది. టైర్లు, శకలాలు లోపల కనిపించాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా, 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది.