వరదల బీభత్సం.. తెలంగాణలో 26 మంది మృతి

53చూసినవారు
వరదల బీభత్సం.. తెలంగాణలో 26 మంది మృతి
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో క్షేత్రస్థాయి సిబ్బంది పంపిన ప్రాథమిక సమాచారం ప్రకారం 117 గ్రామాల్లో 67 వేల మంది నష్టపోయారు. 26 మంది మృతిచెందగా మరో ఇద్దరు వరదల్లో గల్లంతయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. గత నెల 30 నుంచి బుధవారం వరకూ జిల్లాలవారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా కరీంనగర్‌లో 92.8 సెం.మీ., వరంగల్‌లో 61.8, నల్గొండలో 51.5, మహబూబాబాద్‌లో 39, ఖమ్మంలో 28.4 సెం.మీ. వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్