మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ కు నీటిమట్టం పెరగడంతో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరాలయంలో వేపదారు శివలింగాన్ని కృష్ణానది జలాలు తాకాయి. దీంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు నీటి గర్భంలోనే ఉంటుంది. 4 నెలలు మాత్రమే భక్తులు సర్వేశ్వరుడిని దర్శించుకోవచ్చు.