హైదరాబాద్‌లో 300 ప్రాంతాల్లో వరద నీరు: హైడ్రా

77చూసినవారు
హైదరాబాద్‌లో 300 ప్రాంతాల్లో వరద నీరు: హైడ్రా
TG: వర్షాకాలంలో విపత్తు నిర్వహణ అంతా ఒకే గొడుగు కింద ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పేర్కొన్నారు. "హైదరాబాద్‌లో 300 ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తోంది. GHMC పరిధిలోని మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లను హైడ్రాకు అప్పగించింది. వరద నీటిని చెరువులు, నాలాల్లోకి మళ్లించే వ్యవస్థ సరిగా లేదు. ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాది వర్షాకాలంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం" అని రంగనాథ్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్