కృష్ణా నది బేసిన్‌లో వర్షాలు పెరగడంతో శనివారం జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి, స్పిల్‌వే ద్వారా 93,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా 5 హైడ్రో యూనిట్ల ద్వారా 28,886 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు.