అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో కుండపోత వర్షాలతో భారీ వరదలు ముంచెత్తాయి. కెర్‌విల్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరదలలో చిక్కుకున్న 200 మందికిపైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో మిస్టిక్ క్యాంప్ అనే వేసవి శిక్షణ శిబిరం వరదల్లో మునిగిపోయింది. అందులోని 23 బాలికలు గల్లంతయ్యారు.