టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

70చూసినవారు
టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
TG: సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని సీఎం రేవంత్ అధికారులకు బుధవారం సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. "తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న, అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి." అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్