ఫుడ్‌ పాయిజన్‌.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత

82చూసినవారు
ఫుడ్‌ పాయిజన్‌.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్‌ ఘటన కలకలం రేపింది. దీంతో వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు అయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులకు ఆసుపత్రి పాలైనా తల్లిదండ్రులకు మాత్రం సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు. వారంతా ఎక్కడ చికిత్స పొందుతున్నారనే సమాచారం కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్