21 రోజులుగా HYD నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కుమురంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని శైలజ (16) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాంకిడి పాఠశాల వసతిగృహంలో OCT 30వ తేదీ రాత్రి ఆలుగడ్డ కూర, పప్పుతో భోజనం తిన్న 60 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా ఇద్దరు కోలుకున్నారు. శైలజ చికిత్స పొందుతూ మృతి చెందింది.