కాంగ్రెస్ సర్కారుపై BRS మరోసారి కీలక విమర్శలు చేసింది. 'రేవంత్ తుగ్లక్ పాలనలో 14 నెలల్లోనే 64 ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదు అయ్యాయి. మొత్తం 1316 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. కాంగ్రెస్ సర్కారుకి గురుకుల పాఠశాలల పట్ల కనీస బాధ్యత లేదు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదు, పట్టింపు లేదు. ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే, రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి లేడు' అని BRS 'X' వేదికగా విమర్శించింది.