పందెంకోడి మాంసం కోసం.. కర్రలు, బీరు సీసాలతో కొట్టుకున్నారు(వీడియో)

75చూసినవారు
AP: అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి మాంసం కోసం  ఇరువర్గల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కర్రలు, బీరు సీసాలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి  తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో బాలింతైన ఒక మహిళకు కూడా స్వల్ప గాయాలు కావడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్