హర్యానాలో ఇప్పుడు ఎలక్షన్ సీజన్. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ కూడా తమ లిస్టును బయటపెట్టింది. అయితే మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు ఆ లిస్టులో చోటు దక్కలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ ఆవేదనకు గురయ్యారు. బాధను తట్టుకోలేక కన్నీళ్లు రాల్చారు.