ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై మాజీ సీఎం అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. మనీశ్ గుప్తా ఇటీవల పలువురు అధికారులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులతో సమావేశమైన ఫొటోను షేర్ చేసి విమర్శలు గుప్పించారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ కోతలు,ప్రైవేటు పాఠశాలల ఫీజులు పెరిగిపోవడానికి ఆయా శాఖల్లో మనీశ్ గుప్తా జోక్యం చేసుకోవడమే కారణమని మండిపడ్డారు.