TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు కేసీఆర్ ఇక్కడే ఉండనున్నారు. ఆ తర్వాత ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా రెండు రోజుల క్రితం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.