అహ్మదాబాద్‌లోని మేఘానిలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనలో 110 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.