తెలంగాణలో డ్రగ్స్ అక్రమ రవాణాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆ యువకుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మాజీ సీఎస్ కుమారుడని ప్రాథమికంగా తెలుస్తోంది.