జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన DRDO బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రా మాజీ చీఫ్ అలోక్ జోషీ నేతృత్వంలోని NSABను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ప్రధాని నేతృత్వంలోని జాతీయ భద్రతా కౌన్సిల్‌కు పలు సూచనలు చేస్తుంది. ఏడుగురు సభ్యులుండే ఈ బోర్డులో ఇప్పటికే ఆరుగురిని నియమించగా.. తాజాగా సతీశ్‌రెడ్డికి చోటు కల్పించారు.