AP: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.