సీఎం పర్యటన.. మాజీ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్ట్

82చూసినవారు
సీఎం పర్యటన.. మాజీ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ఏన్కూరు లింక్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారు. అయితే సీతారామ ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వైరా మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్