మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ జాతీయ రహదారి టోల్‌గేట్ వద్ద ఆదివారం ఉదయం కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, భారాస నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడి ఇన్నోవా కారులోనే అపహరించి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తుప్రాన్ టోల్‌గేట్ వద్ద వాహనం వేగం తగ్గడంతో కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న హరీశ్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిర్మల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.