తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సంతకాలు సేకరిస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.